ఓంరౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. అయితే ఈ దసరా నుంచే ఈ సినిమా ప్రమోషన్స్ ని ప్రారంభించాలని మూవీ టీం డిసైడ్ అయ్యిందట. దసరా కానుకగా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారని సమాచారం. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. మాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ను అక్టోబరు 3న విడుదల చేసే ఛాన్సుంది.