మీనాక్షి చౌదరి మోడల్ నుంచి నటిగా మారింది. 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. ఈ యేడాది ఈ భామ రవితేజ సరసన ‘ఖిలాడి’లో నటించింది. ఈ సినిమా ఫెయిల్ కావడంతో ఈ భామ ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు ఈ భామ అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోంది. హర్యానాకు చెందిన ఈ భామ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. హీరోయిన్‌గా తెరంగేత్రం చేయకముందే ఫోటో షూట్స్‌తో అదరగొడుతోంది.మీనాక్షి చౌదరి త్వరలో తెలుగు అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. త్వరలో దానికి సంబంధించిన సమాచారం అధికారికంగా వెలువడాల్సి ఉంది.