ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసక్తిని రేకెత్తిస్తున్న ధనుష్ "నేనే వస్తున్నా" టీజర్

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 15, 2022, 07:29 PM

కొంచెంసేపటి క్రితమే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన "నేనే వస్తున్నా" టీజర్ విడుదలైంది.  సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించిన ధనుష్ ఒక పక్క క్రూయల్ గా , మరోపక్క ఇన్నోసెంట్ గా నటిస్తూ తనతో తానే పోటీపడుతూ నటించారు. ఇక, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొచ్చేసరికి యువన్ శంకర్ రాజా సైకో థ్రిల్లర్ కు సరిగ్గా సెట్ అయ్యే మ్యూజిక్ ను ఈ సినిమాకు అందించి, నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు.
సెల్వరాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు కాగా, ఇందూజ రవిచంద్రన్, ఎల్లి అవ్రామ్ హీరోయిన్లుగా నటించారు. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ తను ఈ సినిమాను నిర్మించగా, తెలుగులో ఈ మూవీ హక్కులను ప్రఖ్యాత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కొనుగోలు చేసింది. పోతే, ఈ చిత్రం సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa