తెలుగు చిత్ర కార్మికులకు వేతనాలు పెరిగాయి. వేతనాల పెంపు గురించి బుధవారమే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎంత పెంపుదల, ఎప్పటి నుంచి అమలు చేయాలనే దానిపై గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్, నిర్మాతల మండలి సంయుక్తంగా గురువారం ప్రకటన విడుదల చేశాయి.పెద్ద సినిమాలకు పనిచేసే కార్మికుల వేతనాలు 30 శాతం పెరగనున్నాయి. అదే సమయంలో చిన్న సినిమాలకు పనిచేసే కార్మికుల వేతనాలు 15 శాతం పెరగనున్నాయి.పెంచిన వేతనాలు ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి.