శ్రీవిష్ణు హీరోగా నటించిన 'అల్లూరి' ట్రైలర్ రేపు విడుదల కాబోతుంది. ఈలోపు మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం 05:04 గంటలకు అల్లూరి ట్రైలర్ ను నాచురల్ స్టార్ నాని విడుదల చేస్తారని అధికారికంగా ప్రకటించారు.
ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇందులో కయదు లోహర్ హీరోయిన్ కాగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవలే భళాతందనాన చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రీవిష్ణు, ఆ సినిమా తదుపరి ఎంతో నమ్మకంగా చేస్తున్న చిత్రమిది. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.