పాదయాత్ర పేరిట వివిధ నగరాల్లో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టిన "కృష్ణ వ్రింద విహారి" చిత్రబృందం రేపు విజయవాడ, గుంటూరు, ఏలూరులలో ప్రచారం చేయబోతుంది. రేపు ఉదయం పదింటికి గుంటూరు బస్టాండ్ నుండి హిందూ కాలేజ్ సిగ్నల్స్ వరకు మూవీ టీం పాదయాత్ర చేస్తారు. సాయంత్రం నాలుగింటికి విజయవాడ కంట్రోల్ రూమ్ నుండి గుణదల వరకు పాదయాత్ర మరియు ఐదున్నరకు పీవీపీ మాల్ ను విజిట్ చేస్తారు. ఆపై రాత్రి ఏడింటికి ఏలూరు పాత బస్టాండ్ నుండి ఫైర్ స్టేషన్ వరకు పాదయాత్ర చేసి ప్రమోషన్స్ ను ముగిస్తారు.
అనీష్ R కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. బాలీవుడ్ హీరోయిన్ షెర్లీ సెటియా ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.
ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉష మూలుపురి నిర్మిస్తున్నారు. పోతే, ఈ చిత్రం సెప్టెంబర్ 23వ తేదీన విడుదల కాబోతుంది.