200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ పోలీసుల సమన్ల మేరకు ఆమె గురువారం పోలీసుల ఎదుట హాజరయ్యారు. నోరా ఫతేహి ఢిల్లీలోని మందిర్‌మార్గ్‌లోని ఆర్థిక నేరాల విభాగం కార్యాలయానికి వచ్చారు. ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ నుంచి ఆమెకు లభించిన ఖరీదైన బహుమతులు, ఇతర ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ఆమెను 6 గంటల పాటు విచారించారు.