SR కళ్యాణమండపం సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ - హీరో కాంబోలో రాబోతున్న మరొక చిత్రం "నేను మీకు బాగా కావాల్సినవాడిని". SR కళ్యాణమండపం రేంజులో ఈ సినిమా కూడా అద్దిరిపోయే హిట్ అవ్వాలని ప్రేక్షకాభిమానులు కోరుకుంటున్నారు.
ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు నచ్చడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రేపే ఈ సినిమా థియేటర్లకు విచ్చేయబోతుంది.
కోడి రామకృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా, కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మింపబడుతున్న ఈ చిత్రానికి శ్రీధర్ గాదె దర్శకుడు కాగా, కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్ జంటగా నటిస్తున్నారు.