ఇటీవలే విడుదలైన ట్రైలర్ తో ప్రభంజనం సృష్టించిన "విక్రమ్ వేద" లేటెస్ట్ గా అద్దిరిపోయే అప్డేట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అదేంటంటే, హిందీ ఫిలిం ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని విధంగా దాదాపు వందకు పై చిలుకు థియేటర్లలో ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతుందట.
తమిళ సూపర్ హిట్ మూవీ "విక్రమ్ వేద" కు అఫీషియల్ హిందీ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పుష్కర్, గాయత్రి డైరెక్ట్ చేసారు. రాధికా ఆప్టే, రోహిత్ సరఫ్, షరీబ్ హష్మీ మరియు యోగితా బిహాని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్ మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30, 2022 న ప్రేక్షకుల ముందుకు రానుంది.