బ్రహ్మాస్త్ర సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా నాగార్జున ముంబై వెళ్లాడు. ఆ సందర్భంగా మీడియా చైతు, సామ్ విడాకులపై ప్రశ్నించగా నాగ్ బదులిచ్చాడు. నాగ చైతన్య ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాడని, తనకు తన కొడుకు కళ్లలో ఆనందం చూడటం సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు తాము విడాకుల విషయం గురించి ఆలోచించటం లేదని, తమ జీవితాల్లో అదొక బాధాకర సంఘటన అని తెలిపారు. ప్రస్తుతం చైతు ప్రశాంతంగా ఉండటం ఆనందాన్ని ఇస్తోందన్నారు.