జైద్ ఖాన్, సోనాల్ మోంటేరియ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం "బనారస్". జయతీర్థ డైరెక్ట్ చేసిన ఈ మూవీని నేషనల్ ఖాన్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తిలక్ రాజ్, అహ్మద్ ఖాన్ నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ట్రోల్ సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది. అజనీష్ లోక్ నాధ్ స్వరపరిచిన ఈ పాటను జెస్సి గిఫ్ట్ ఆలపించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు. పెప్పి మ్యూజిక్ తో, క్యాచీ లిరిక్స్ తో మున్ముందు ఈ పాట చార్ట్ బస్టర్ లా నిలిచేలా కనిపిస్తుంది.