కన్నడ స్టార్ హీరోలలో ఒకరైన స్టార్ కిచ్చా సుదీప్ నటిస్తున్న తాజా చిత్రం “విక్రాంత్ రోనా. ఆయన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన మోస్ట్ ఎవైటెడ్ చిత్రంగా ఇది తెరకెక్కింది. ఈ క్రేజీ థ్రిల్లర్ మంచి ఓపెనింగ్స్ రాబట్టి తెలుగులోనూ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే, పాన్ ఇండియా స్థాయి థియేటర్లలో హిట్ అయిన ఈ చిత్రం ఎట్టకేలకు OTTలో అలరించడానికి వచ్చింది. అన్ని భాషల్లోని ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ కంపెనీ డిస్నీ+ హాట్ స్టార్ సొంతం చేసుకుంది మరియు ఈ రోజు నుండి సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైంది.