బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ సినిమాలతో ఎంత పాపులారిటీని సంపాదించుకుందో, తన ముక్కుసూటితనంతో మరింత క్రేజ్ సంపాదించుకుంది.
ఎప్పుడు బాలీవుడ్ హీరోలను విమర్శించే కంగనా తొలిసారి ఒక బాలీవుడ్ హీరోను ఆకాశానికి పొగిడేసింది. బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్ కు శుభాకాంక్షలు తెలుపుతూ కంగనా చేసిన ఇంస్టాగ్రామ్ స్టోరీ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇంతకూ విషయమేంటంటే, అజయ్ అహ్మదాబాద్ లో తన సొంత ముల్టీప్లెక్స్ థియేటర్ ను ఈ రోజు నుండే ప్రారంభించారు. అలానే మరో మూడు నగరాల్లో థియేటర్లను నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు.
అజయ్ చేస్తున్న ఈ పనితో ఇంప్రెస్ ఐన కంగనా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. అజయ్ చేస్తున్న పని నిరుద్యోగులను కొంతవరకైనా తగ్గిస్తుంది. చైనాలో ధియేటర్ల సంఖ్య 70,000గా ఉంటే, మన ఇండియాలో ఏడువేలు మాత్రమే. ఈ విధంగా మన స్క్రీన్ కౌంట్ కూడా పెరుగుతుందని కంగనా తెలిపింది.