గత శుక్రవారం విడుదలైన శర్వానంద్ "ఒకేఒక జీవితం" తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆడియన్స్, క్రిటిక్స్ .... ఇద్దరు ఏకగ్రీవంగా ఈ సినిమాకు సూపర్ హిట్ రివ్యూ ఇస్తున్నారు. రోజురోజుకూ వసూళ్లను పెంచుకుంటూ పోతున్న ఈ మూవీ ఓవర్సీస్ లో కూడా బాగానే రన్ అవుతుంది.
తొలిరోజున ఓవర్సీస్ లో ఒకే ఒకే జీవితం సినిమా 100కే కలెక్షన్లతో గుడ్ స్టార్ట్ అందుకుంది. వారంలో హాఫ్ మిలియన్ కలెక్షన్లకు చేరువలోకొచ్చింది. ఈ వీకెండ్ కి ఈ కలెక్షన్లు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది.
శ్రీ కార్తీక్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అక్కినేని అమలగారు కీలకపాత్రలో నటించారు. రీతువర్మ హీరోయిన్ గా నటించింది.