పెళ్ళిసందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ శ్రీలీల. ఫలితం విషయం పక్కన పెడితే, ఆ సినిమాతో శ్రీలీల తెలుగు ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసేసింది. ఒక్క సినిమాతో నాలుగైదు వరస ప్రాజెక్టుల్లో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.
వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమా ఇటీవలే అధికారికంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. లేటెస్ట్ గా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఈ మేరకు హైదరాబాద్ కొచ్చిన శ్రీలీలకు మేకర్స్ ఖరీదైన హోటల్లో సూట్ రూమ్ ను బుక్ చేశారట. ఆ రూమ్ ఖరీదు రోజుకు 21వేలంట. అప్ కమింగ్ హీరోయిన్ కు ఇంతటి ఖరీదైన అకామడేషన్ కల్పించడం ఫిలింనగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.