ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రానా చేతుల మీదుగా "కబ్జా" టీజర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 10:33 AM

పీపుల్స్ స్టార్ ఉపేంద్ర, కిచ్ఛా సుదీప్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ "కబ్జా". అండర్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు R చంద్రు డైరెక్టర్.
ఈ మూవీ టీజర్ రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు. తెలుగులో ఈ టీజర్ ను ఈ రోజు సాయంత్రం 05:04 గంటలకు దగ్గుబాటి రానా విడుదల చెయ్యనున్నారు.
కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలలో వచ్చే ఏడాదిలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. రవి బస్రుర్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa