శ్రీవిష్ణు హీరోగా నటించిన "అల్లూరి" ట్రైలర్ నిన్ననే విడుదలైంది. శ్రీవిష్ణు స్టన్నింగ్ పెర్ఫార్మన్స్, పదునైన సంభాషణలతో ఈ ట్రైలర్ ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ చూరగొంటుంది. యూట్యూబులో ఈ ట్రైలర్ కు ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్, 18కే లైక్స్ వచ్చాయి.
పోతే, ఈ ట్రైలర్ ను నాచురల్ స్టార్ నాని విడుదల చేసారు. మరో విశేషమేంటంటే, రేపు జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు.
ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
తనికెళ్ళ భరణి, సుమన్, రాజా రవీంద్ర, 30ఇయర్స్ పృథ్విరాజ్, జయవాణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa