మలయాళ బిగ్ బాస్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించిన అజయ్ కతుర్వర్ సోలో హీరోగా నటిస్తున్న చిత్రం 'అజయ్ గాడు'. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాక దర్శకుడిగా, సహనిర్మాతగా కూడా అజయ్ వ్యవహరిస్తున్నారు.
గతంలో 'రాగల 24 గంటల్లో', 'అలాంటి సిత్రాలు' సినిమాలలో కీలక పాత్రలు పోషించిన అజయ్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రమిదే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ టీజర్ రేపు సాయంత్రం 04:05 గంటలకు విడుదల కాబోతుంది.
పోతే, ఈ సినిమాలో భానుశ్రీ, శ్వేతా మెహతా హీరోయిన్లుగా నటిస్తున్నారు. విశేషమేంటంటే, ఈ సినిమాకు నలుగురు సంగీతం దర్శకులు పనిచేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa