స్టార్ హీరోయిన్ తమన్నా 'బబ్లీ బౌన్సర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో సెప్టెంబరు 23వ తేదిన విడుదల కానుండగా సినీనటి తమన్నా బౌన్సర్లు ప్రెస్ మీట్ సందర్భంగా దురుసుగా ప్రవర్తించారు. మీడియా ప్రతినిధులపై దాడికి దిగడంతో ఇద్దరు కెమెరా మెన్లు గాయాలపాలయ్యారు.