విభిన్న ప్రేమకథా చిత్రాల దర్శకుడు తేజ డైరెక్ట్ చేస్తున్న చిత్రం "అహింస". ఈ సినిమాతో దగ్గుబాటి రానా తమ్ముడు అభిరాం హీరోగా పరిచయమవుతున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. 'కలలో అయినా ...కలయికలో అయినా' అని సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్, సత్య యామిని కలిసి ఆలపించారు. RP పట్నాయక్ సంగీతం అందించారు. ఈ పాటకు సంబంధించిన పూర్తి లిరికల్ వీడియో సెప్టెంబర్ 19వ తేదీన విడుదల కాబోతుంది.
తేజ - RP కాంబోలో సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ వచ్చాయి. ఈ సినిమా కూడా ఆ కోవలోకే చేరుతుందని ఈ ప్రోమో బట్టి క్లియర్ గా అర్ధమవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa