ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా భాషలలో భారీ ఎత్తున విడుదలైన రౌడీ హీరో విజయ్ దేవరకొండ - డాషిండ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల "లైగర్" మూవీ లేటెస్ట్ గా డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మేకర్స్ ఈ మూవీని అనుకున్న సమయానికన్నా ముందుగానే డిజిటల్ రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గురువారం అంటే సెప్టెంబర్ 22 నుండే లైగర్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కావడానికి రెడీ అవుతుందని టాక్.
భారీ బడ్జెట్ తో, దేశవ్యాప్తంగా ట్రెమండస్ ప్రమోషన్స్ చేసుకున్న లైగర్ మూవీ కనీసం నెల కూడా తిరక్కుండానే డిజిటల్ ఎంట్రీ ఇవ్వడం ఆశ్చర్యకరం.