మెగాస్టార్ చిరంజీవి నుండి ఈ దసరాకు విడుదల కాబోతున్న సినిమా "గాడ్ ఫాదర్". మోహన్ రాజా డైరెక్షన్లో మలయాళ సూపర్ హిట్ ఫిలిం 'లూసిఫర్' కు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీరోల్ లో నటించడం విశేషం.
విడుదల తేదీ దగ్గర పడుతున్నా ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేయట్లేదని, సినిమాపై ఉన్న బజ్ కాస్తా నిర్మాతల నిర్లక్ష్యం వల్ల పోతుందని బాధపడుతున్న మెగా ఫ్యాన్స్ కు డైరెక్ట్ గా చిరు నుండే బ్లాక్ బస్టర్ బొనాంజ వచ్చింది.
నేను రాజకీయానికి దూరంగా ఉన్నాను ...కానీ.. రాజకీయం నానుండి దూరం కాలేదు... అని గాడ్ ఫాదర్ సినిమాలో చిరు చెప్పే పవర్ఫుల్ డైలాగ్ ను ఆడియో రూపంలో చిరు రిలీజ్ చేసారు. ఇక మీదటి నుండి ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు కూడా జరుగబోతున్నాయట.