ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలపతి 67 : విజయ్ సరసన ఈ సీనియర్ హీరోయిన్..?

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 05:07 PM

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇటీవలే బీస్ట్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం కాలేదు. దీంతో అభిమానులు విజయ్ నుండి బ్లాక్ బస్టర్ హిట్ రావాలని కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో విజయ్ - లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కే మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే, ఇదే కాంబోలో తెరకెక్కిన మాస్టర్ సూపర్ హిట్ అయ్యింది. ఐతే, ఈ సినిమాకు ఇంకా చాలా సమయమే ఉంది. కానీ ఈ సినిమాపై వచ్చే వార్తలకు ఎలాంటి కొదువ లేకుండా పోతుంది.
ఈ సినిమాలో సమంత పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తుందని, బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారని... ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతుండగా, లేటెస్ట్ గా మరొక ఇంటరెస్టింగ్ న్యూస్ వచ్చి ఈ లిస్టులోకి చేరింది. అదేంటంటే ఈ మూవీలో విజయ్ కు జోడిగా సీనియర్ హీరోయిన్ త్రిష నటిస్తుందంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. మరి, ఈ విషయంలో మేకర్స్ ఎనౌన్స్మెంట్ చేసేంత వరకు ఎదురుచూడాల్సిందే. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa