హీరోయిన్ సమంత చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతోందని, స్కిన్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఆమె మేనేజర్ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని, సమంత ఆరోగ్యంగానే ఉన్నారని, ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పారు. సమంత యూఎస్‌కు ఎందుకు వెళ్తున్నారనే దానిపై ఆయన స్పందించలేదు. సామ్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది.