RX 100 హీరో కార్తికేయ నేడు 30వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఎనౌన్స్ చేయబడింది.
"బెదురులంక 2012" అనే ఇంటరెస్టింగ్ అండ్ యూనిక్ టైటిల్ తో ఈ సినిమా అధికారిక ప్రకటన జరిగింది. ఈ సినిమాలో కార్తికేయ సరసన డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి నటిస్తుంది. క్లాక్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తున్న ఈ సినిమాను యువరాజు సమర్పిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.