తెలుగులో బుల్లితెర ప్రముఖ యాంకర్ లాస్య-మంజునాథ్ దంపతులకు మరో బిడ్డ పుట్టనుంది. తాను గర్భవతిని అయ్యానని, తమకు మరో బిడ్డ పుట్టనుందని ఆమె బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. పెళ్లి తర్వాత యాంకరింగ్‌కు కొంత కాలం ఆమె దూరమైంది. బిగ్‌బాస్‌లో పాల్గొన్న తర్వాత మరలా కెరీర్‌పై దృష్టిపెట్టింది. ఈ తరుణంలో ఆమె మరో బిడ్డకు జన్మనిస్తున్నట్లు పేర్కొనడంతో, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.