అప్పుడెప్పుడో ఆగిపోయిన ఇండియన్ 2 షూటింగ్ మొన్నీమధ్యనే పునఃప్రారంభమైందన్న విషయం తెలిసిందే కదా. ఈ మూవీలో లీడ్ హీరో హీరోయిన్లు కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ నిన్నటి నుండే ఇండియన్ 2 సెట్స్ లోకి అడుగుపెట్టారు. వీరిద్దరి కాంబో సీన్స్ ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు.
షూటింగ్ లో భాగంగా హార్స్ రైడింగ్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న కాజల్ మునుపటిలాగా అంత సులువుగా నేర్చుకోలేకపోతున్నానని అంటుంది. ఏప్రిల్ నెలలో కాజల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బాబు పుట్టిన నాలుగు నెలలకే కాజల్ ప్రొఫెషనల్ లైఫ్ ని స్టార్ట్ చేసేసింది.
ఈ నేపథ్యంలో ఇదివరకటి ఎనర్జీ లెవెల్స్ తనలో లేవని, సోలోగా హార్స్ రైడ్ చేయడమేంటే, పెద్ద టాస్క్ లాగా ఉందని, కానీ తనలోని వర్క్ స్పిరిట్ తనను ముందుకు నడిపిస్తుందని తెలుపుతూ... ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.