మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ RC 15 షెడ్యూల్ బ్రేక్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గత వారంలో సిస్టర్స్ తో కలిసి వెకేషన్ కి వెళ్లొచ్చిన చెర్రీ ఆ వెంటనే భార్య ఉపాసన, పెట్ రైమ్ తో కలిసి జాలిగా విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు.
వెకేషన్ నుండి తిరుగు ప్రయాణమైన చెర్రీ దంపతులు ఈ రోజు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వస్తున్న చెర్రీ, ఉపాసనల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తున్నాయి.
సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం చెర్రీ శంకర్ తో RC 15 చేస్తున్నారు. శంకర్ ఇండియన్ 2 షెడ్యూల్ తో బిజీగా ఉండడంతో RC 15 కు షార్ట్ గ్యాప్ వచ్చింది. ఐతే, వచ్చే వారం నుండి ఈ మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.