పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం "సలార్". కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిం బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్నారు.
కృష్ణంరాజు గారి ఆకస్మిక మరణంతో ఈ మూవీ షూటింగ్ కు సడెన్ బ్రేక్ పడింది. లేకుంటే ఇప్పటికి రామోజీఫిలింసిటీలో ఈ మూవీ షూటింగ్ ఆఘమేఘాల మీద జరుగుతూ ఉండేది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సలార్ గా ప్రభాస్ రాక కోసం రామోజీ ఫిలింసిటీలో ఏర్పాటు చేసిన 12 భారీ సెట్లు ఎదురుచూస్తున్నాయట. 12 సెట్లలో ప్రభాస్ కు సంబంధించిన ఎపిసోడ్లు కేవలం రెండు నుండి నేడు రోజుల్లోనే చిత్రీకరించనున్నారట. వచ్చే నెల నుండి ఈ మూవీ షూటింగ్ తిరిగి పట్టాలెక్కనుందని ప్రచారం జరుగుతుంది.
పోతే, ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు.