బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటవారసురాలిగా సినీ రంగప్రవేశం చేసిన సోనమ్ కపూర్ కు సంబంధించిన ప్రెగ్నన్సీ ఫోటోషూట్లు సోషల్ మీడియాలో ఏ రేంజులో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆగస్టు 20వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ లేటెస్ట్ గా బాబు పేరును అధికారికంగా ఎనౌన్స్ చేసింది.
బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహుజాను 2018లో వివాహమాడిన సోనమ్ ఈ ఏడాది ఏప్రిల్ లో సోషల్ మీడియా ద్వారా తన ప్రెగ్నన్సీ ని ఎనౌన్స్ చేసింది. ఇకపోతే, బాబుకు వాయు కపూర్ అహుజాగా నామకరణం చేసినట్టు తెలుస్తుంది.