దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తున్న సినిమాలలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన "ఆదిపురుష్" ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో భారతీయ ఇతిహాసం "రామాయణం" ఆధారంగా తెరకెక్కింది. ఇందులో కృతిసనన్ హీరోయిన్ గా నటించగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు.
ఈ మూవీ టీజర్ దసరా పండుగ సందర్భంగా విడుదల కాబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ అయోధ్య నగరంలో జరగబోతుందట. అంతేకాక, ఆ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ హాజరు కాబోతున్నారని వినికిడి. ఐతే, ఈ విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.