యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా "నేను మీకు బాగా కావాల్సినవాడిని". సంజనా ఆనంద్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ శంకర్ డైరెక్టర్.
సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. పోతే, ఈ మూవీ నుండి లేటెస్ట్ గా మాస్ మసాలా ఐటెం సాంగ్ "అట్టాంటి ఇట్టాంటి" ఫుల్ వీడియో విడుదలైంది. ఇందులో బాలయ్య సూపర్ హిట్ సాంగ్ 'చిలకపచ్చ కోక', మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైం ఐటెం నెంబర్ 'ఆట కావాలా పాట కావాలా' సాంగ్స్ డీజే వెర్షన్ లు ఉండడం విశేషం. వీటికి కిరణ్ ఫస్ట్ క్లాస్ స్టెప్స్ వేసి మరింత ఊపందించాడు.
కోడి రామకృష్ణ గారి పెద్ద కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా, కోడి దివ్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మింపబడుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.