టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా, కోలీవుడ్ డైరెక్టర్ అశ్వంత్ మరిముత్తు తెరకెక్కిస్తున్న చిత్రం "ఓరి దేవుడా". ఇందులో విక్టరీ వెంకటేష్ సర్ప్రైజింగ్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నారని టాక్. ఐతే, ఈ విషయంపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
కొన్నాళ్ల నుండి సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి సర్ప్రైజింగ్ ఎనౌన్స్మెంట్ వచ్చింది. అదేంటంటే, ఈ రోజు సాయంత్రం 05:04 నిమిషాలకు చిన్న గ్లిమ్స్ ను రిలీజ్ చేస్తామని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
2020లో విడుదలైన కోలీవుడ్ ఫిలిం "ఓహ్ మై కడవులే" కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.