రాహు ఫేమ్ అభిరాం వర్మ నటిస్తున్న కొత్త చిత్రం "నీతో". ఈ సినిమాకు బాలు శర్మ దర్శకుడు కాగా సాత్వికా రాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.
వివాహానికి ఇన్సూరెన్స్ అనే విభిన్న కధాంశంతో విడుదలైన ట్రైలర్ ఇంటరెస్టింగ్ గా ఉండడంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి.
మిలియన్ డ్రీమ్స్, పృథ్వి క్రియేషన్స్ సంయుక్త బ్యానర్లపై AVR స్వామి, కీర్తన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లేటెస్ట్ గా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. సెప్టెంబర్ 30న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.