ట్రైలర్ తో భారీ ప్రకంపనలు సృష్టించిన ది ఘోస్ట్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో, మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు చేసారు. సెప్టెంబర్ 25వ తేదీన కర్నూల్ లోని STBC కాలేజీ గ్రౌండ్స్ లో ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున జరగబోతుంది.
సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.