షెడ్యూల్ టైం కు విడుదల చెయ్యకుండా మెగా అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచిన గాడ్ ఫాదర్ మేకర్స్, రెండ్రోజులు వెయిట్ చేయించినా బ్లాక్ బస్టర్ ఔట్ పుట్ తో ప్రేక్షకాభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. అదేనండి... గాడ్ ఫాదర్ నుండి "తార్ మార్ తక్కర్ మార్" లిరికల్ వీడియో విడుదలైపోయింది.
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ పాటకు శాండీ స్టెప్స్ కంపోజ్ చేసారు. తమన్ అందించిన పెప్పీ మ్యూజిక్, శ్రేయా ఘోషల్ హస్కీ వాయిస్ ఈ పాటను మళ్ళీ మళ్ళీ వినేలా చేస్తుంటే, స్క్రీన్ పై కనిపించే చిరు, సల్మాన్ లు కను రెప్ప వెయ్యనీయకుండా చేస్తున్నారు.
మోహన్ రాజా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నయనతార, సత్యదేవ్, సునీల్, పూరి జగన్నాధ్, బిజూ మీనన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ ఐదవ తేదీన ఈ సినిమా తెలుగు, హిందీ భాషలలో విడుదల కాబోతుంది.