సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ డైరెక్షన్లో చెయ్యబోతున్న మూవీకి సంబంధించి ఇటీవలే ఒక పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ పూర్తయ్యింది. అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిలింసిటీలలో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ దసరా పండగ అనంతరం ప్రారంభం కానుంది. అప్పుడు జరగబోయే షెడ్యూల్ లో సూపర్ స్టార్, బుట్టబొమ్మ పూజాహెగ్డే పాల్గొంటారు.
పుష్కరం తదుపరి ఈ కాంబోలో మూవీ రాబోతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.