పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ కాంబోలో "హరిహర వీరమల్లు" అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా షూటింగ్ కు మధ్యలో చాలాసార్లు బ్రేక్ పడింది. కరోనా మరియు పవన్ రాజకీయాలతో బిజీగా మారడం వలన ఈ మూవీ అంతకంతకూ ఆలస్యమవుతూ వస్తుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, బస్సు యాత్రను పోస్ట్ పోన్ చేసుకున్న కళ్యాణ్ వచ్చే నెల పదహారు నుండి వీరమల్లును పునఃప్రారంభించాలని అనుకుంటున్నారట.
మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై AM రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 30ను రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసుకుంది.