నాగశౌర్య, షెర్లీ సెటియా జంటగా నటిస్తున్న చిత్రం "కృష్ణ వ్రింద విహారి". ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 23వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. 2గంటల 19 నిముషాలు నిడివి గల ఈ సినిమా యూ/ఏ సెర్టిఫికెట్ పొందింది.
అనీష్ R కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. బాలీవుడ్ హీరోయిన్ షెర్లీ సెటియా ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మూలుపురి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.