యంగ్ హీరో శ్రీవిష్ణు పవర్ఫుల్ కాప్ రోల్ లో నటిస్తున్న తొలి చిత్రం "అల్లూరి". కయదు లోహర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకుడు.
ఈ సినిమాలో శ్రీవిష్ణు "అల్లూరి సీతారామరాజు" అనే పవర్ఫుల్ కాప్ రోల్ లో నటిస్తున్నారు. అల్లూరిగా శ్రీవిష్ణు రేపే థియేటర్లకు రాబోతున్నారు. ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా, ఈ సినిమాతో శ్రీవిష్ణు సూపర్ హిట్ కొట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
తనికెళ్ళ భరణి, సుమన్, రాజా రవీంద్ర, 30ఇయర్స్ పృథ్విరాజ్, జయవాణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.