తాజాగా తన ఫేవరెట్ స్టార్ అక్షయ్‌కుమార్‌తో ఓ సెల్పీ దిగి దానిని సామాజిక మాధ్యమాల్లోనూ పోస్ట్ చేసింది నటి పూజాహెగ్డే. ఆ పిక్‌కి అదిరిపోయే కొటేషన్ ఇచ్చింది. “కామెడీ జీనియస్ అక్షయ్ కుమార్ సర్ తో కలిసి నటిస్తున్నా. షూటింగ్ లో ఎంతో ఫన్ ఉంది క్రేజీగా. పసోళ్లలో పసోడిలా ఉంటారు.. ఈ మార్షల్ ఆర్ట్స్ కింగ్ నిపుణుడు. సెట్ లో బోలెడంత ఇంప్రైవైజేషన్ చేస్తారు. ఎంతో నేర్చుకునేందుకు ఆస్కారం ఉంది. అతడితో ఆటలాడడం అంత సులువేం కాదు.. ఎందుకంటే ప్రతిసారీ అతడే ఈ ఫన్నీ గేమ్స్ లో విజేత అవుతాడు అని తెలిపింది.
ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ వెంచర్ హౌస్ ఫుల్ 4తో బిజీగా ఉన్నాడు అక్కీ. అతడితో పాటు పూజా హెగ్డే – రానా కూడా సెట్స్ లో జాయిన్ అయ్యారు. ఇంతకీ పూజా ఎవరి సరసన నటిస్తోంది. అక్కీ సరసనా.. లేక రానా సరసనా అన్నది తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa