మెగా అభిమానుల నిరీక్షణకు సరైన మూల్యం చెల్లించారు గాడ్ ఫాదర్ మేకర్స్. తార్ మార్ తక్కర్ మార్ లిరికల్ వీడియోకు మెగా అభిమానుల నుండి మాత్రమే కాక మిగిలిన ప్రేక్షకులు, హిందీ జనాల నుండి కూడా విశేష ఆదరణ లభిస్తుంది. దీంతో తెలుగు, హిందీ భాషలలో విడుదలైన ఈ లిరికల్ వీడియోకు యూట్యూబులో 7 మిలియన్ వ్యూస్ రాగా, టాప్ ట్రెండింగ్ వీడియోస్ లో దూసుకుపోతున్నాయి.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకుడు కాగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.