అదిత్ అరుణ్, హెబ్బా పటేల్ జంటగా రూపొందిన మూవీ 24 కిస్సెస్. ఈ మూవీకి అయోధ్య కుమార్ దర్శకుడు.. ఇప్పటికే ఈ మూవీకి ఎ సర్టిఫికెట్ లభించింది.. దీంతో ఈ మూవీలో హాట్ సీన్స్ హద్దులు దాటి ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఈ మూవీని రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర హీరోయిన్ హెబ్బా పటేల్ తన ఫేస్ బుక్ ద్వారా ఈరోజు మధ్యాహ్నం లైవ్ ఛాట్ చేయనుంది.. మూడు గంటలకు ప్రారంభమయ్యే ఈ ఛాట్ లో అభిమానులు అడిగే పలు ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇవ్వనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa