పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ఆది పురుష్' అప్డేట్ వచ్చేస్తోందట. అక్టోబర్ 2న ఫస్టు వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రేపు చిత్రయూనిట్ స్వయంగా అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం. డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ నటి కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. లంకేశ్ గా సైఫ్ అలీఖాన్ సందడి చేయనున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉంది.