టాలీవుడ్‌లో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే సక్సెస్‌లను సొంతం చేసుకుంటూ స్టార్లుగా ఎదిగిపోతోన్నారు. మరికొందరు మాత్రం టాలెంట్‌తో పాటు అందం ఉన్నా అంతగా ఆఫర్లను అందుకోలేకపోతోన్నారు. తద్వారా కెరీర్‌లను ప్రశ్నార్థకం చేసుకుంటోన్నారు. అలాంటి వారిలో హైదరాబాదీ చిన్నది నందినీ రాయ్ ఒకరు. అప్పుడెప్పుడో హీరోయిన్‌గా పరిచయమైన ఈ భామ.. అన్నీ ఉన్నా అదృష్టం లేకపోవడంతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తూ ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇక, తాజాగా నందినీ ఓ హాట్ ఫొటో వదిలింది.
అందం, టాలెంట్ ఉన్నా హీరోయిన్‌గా అంతగా ప్రభావాన్ని చూపలేకపోయిన నందినీ రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం తన పాపులారిటీని మరింతగా పెంచుకుంటూనే ఉంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో దీని ద్వారా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈ బ్యూటీ తెగ హైలైట్ అవుతోంది