విక్టరీ వెంకటేష్, రానా తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ గా రూపొందుతున్న "రానా నాయుడు" లో ఈ బాబాయ్ - కొడుకులు కలిసి నటిస్తున్నారు.
ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సిరీస్ నుండి లేటెస్ట్ గా అఫీషియల్ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో రానా సినీ సెలెబ్రెటీలకు ఏదైనా ఆపద, లేదా సమస్యలు తలెత్తినప్పుడు వాటిని సాల్వ్ చేసే ఫిక్సర్ పాత్రలో నటించబోతున్నాడు. టీజర్ ఆద్యంతం ఫుల్ టైం యాక్షన్ అండ్ మాస్ మసాలాతో సాగింది. వెంకటేష్ రానా తండ్రి పాత్రలో నటిస్తున్నారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సిరీస్ "రేయ్ దోనోవన్" అమెరికన్ సిరీస్ కు ఇండియన్ అడాప్టేషన్.
త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయంపై అతి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ నుండి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.