"ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" సినిమాతో ఇటీవలే టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన నైట్రో స్టార్ సుధీర్ బాబు కొన్ని నెలల వ్యవధిలోనే మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అదే సుధీర్ పదహారవ సినిమా 'హంట్'.
ఈ సినిమా నుండి కీలకపాత్రల క్యారక్టర్ పోస్టర్లను రివీల్ చేస్తూ వచ్చిన మేకర్స్ హీరో సుధీర్ బాబు క్యారెక్టర్ పోస్టర్ ను కూడా రివీల్ చేసి, అలానే టీజర్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారు. సుధీర్ ఈ సినిమాలో 'అర్జున్ ప్రసాద్' అనే పాత్రలో నటిస్తున్నారు. పోతే, టీజర్ రిలీజర్ అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 04:05 గంటలకు ఇవ్వబోతున్నట్టు తెలిపారు.
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని మహేష్ డైరెక్ట్ చేస్తుండగా, సీనియర్ హీరో శ్రీకాంత్, కోలీవుడ్ హీరో భరత్ నివాస్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.