నిన్ను సామీ సామీ అంటాంటే ...నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామీ... నా సామీ.. అంటూ అదిరిపోయే డాన్స్ స్టెప్స్ వేసి, వాటికి కరెక్ట్ గా సూట్ అయ్యే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి... యువతను ఉర్రూతలూగించింది ... శ్రీవల్లి... అదేనండి.. నేషనల్ క్రష్ రష్మిక మండన్నా. ఇలా డాన్స్ వెయ్యడం వల్లే మోకాలి నొప్పి వచ్చిందేమో ఏమో తెలియదు కానీ... రష్మిక మోకాలి నొప్పితో హైదరాబాద్ లోని ఫేమస్ ఆర్థోపెడిస్ట్ గురువారెడ్డి గారి వద్దకు చికిత్సకు వెళ్ళింది.
ముందుగా రష్మిక డాక్టర్ ను కలిసిందని తెలిసిన వెంటనే ఆమె అభిమానులు కూసింత టెన్షన్ పడ్డారు కానీ, స్వయంగా డాక్టర్ గురువారెడ్డి గారు తన ఇన్స్టాగ్రామ్ లో రష్మిక మోకాలి నొప్పితో తన వద్దకు వచ్చిందని, దానివల్ల ఆమెకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, త్వరలోనే తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుష్ప లో వేసిన క్రేజీ డాన్స్ స్టెప్స్ కారణంగా శ్రీవల్లికి మోకాలి నొప్పులు వచ్చి ఉంటాయని, అలానే త్వరలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా భుజం నొప్పితో తన వద్దకు వస్తారో.. ఏంటో అంటూ చమత్కరించారు.