టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "CSI సనాతన్". శివశంకర్ దేవ్ డైరెక్షన్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మిషా నారంగ్ హీరోయిన్ గా నటిస్తుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ నుండి కీ అప్డేట్ రేపు రాబోతుందని మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపారు. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ లో సీరియస్ గా పరిశీలిస్తున్న ఆది లుక్ ఇంటరెస్టింగ్ గా ఉంది.
చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనీష్ సోలొమన్ సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ సినిమాలో అలీ రెజా, నందిని రాయ్, తారక్ పొన్నప్ప, వాసంతి, భూపాల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa