దేశంలోనే అతిపెద్ద స్టార్లలో రామ్ చరణ్ ఒకరు. మరి రాజమౌళితో RRR సినిమా తర్వాత అతని పాపులారిటీ మరో స్థాయికి ఎలా వెళ్లిందో అందరికి తెలిసిందే. భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత, రామ్ చరణ్ నిన్న భారత క్రికెట్ జట్టులోని ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు మరికొందరు క్రికెటర్లను ఆహ్వానించాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఉత్కంఠ విజయంతో సిరీస్ ను కైవసం చేసుకుంది. చరణ్ నివాసంలో స్టార్ హీరో, హార్దిక్ సరదాగా పార్టీ చేసుకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ15 సినిమా చేస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
![]() |
![]() |